Andhra PradeshHome Page Slider

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హౌస్ కస్టడీ పిటిషన్‌ను కొట్టేసిన ఏసీబీ కోర్టు

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హౌస్ కస్టడీ పిటిషన్‌ను విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టివేసింది. హౌస్ కస్టడీ విషయంలో చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదించినా, ఆ విషయాలను ఏసీబీ జడ్జి పరిగణనలోకి తీసుకోలేదని తెలుస్తోంది. రాజమండ్రి సెంట్రల్ జైలులో 14 రోజుల రిమాండ్‌లో ఉన్న చంద్రబాబు నాయుడును గృహనిర్బంధంలో ఉంచేందుకు అనుమతించాలని కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌పై ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి హిమబిందు తీర్పును రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. నాయుడు తరఫు న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా ఆదివారం రాత్రి పిటిషన్ దాఖలు చేయగా, సోమవారం వాదనలు జరిగాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును మంగళవారానికి వాయిదా వేశారు.