Home Page SliderTelangana

మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన పట్నం మహేందర్‌రెడ్డి

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి గురువారం మధ్యాహ్నం 3 గంటలకు రాజ్‌భవన్‌లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు హాజరయ్యారు. మహేందర్‌రెడ్డి రెండోసారి మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. తెలంగాణ రాష్ట్ర తొలి మంత్రివర్గంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. 2018 వరకు మంత్రిగా కొనసాగారు. కానీ గత సార్వత్రిక ఎన్నికల్లో తాండూరులో ఓటమి చవిచూశారు. అనంతరం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మహేందర్ రెడ్డికి అవకాశం లభించింది. 2019 జూన్‌లో ఎమ్మెల్సీగా గెలుపొందారు. మహేందర్ రెడ్డి 1994, 1998, 2009, 2014లో తాండూరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.