వాలంటీర్ల వ్యవస్థపై దుష్ప్రచారం వద్దు బాబూ!
వాలంటీర్ల వ్యవస్థపై దుష్ప్రచారం దారుణం
వ్యవస్థలన్నింటినీ చంద్రబాబు నాశనం చేశారు
సీఎం వైఎస్ జగన్ వ్యవస్థలకు మళ్లీ జీవం పోశారన్న సజ్జల
చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్‌లు వాలంటీర్లపై ఇష్టానుసారం మాట్లాడుతుండటం దారుణమన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవలు అందించారనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు. ఆ సమయంలో చంద్రబాబు, పవన్ ఎక్కడికి పారిపోయారని నిలదీశారు. కరోనా సమయంలో సేవలు అందించే విషయంలో ఆంధ్రప్రదేశ్ బెస్ట్ స్టేట్‌గా నిలిచిందని గుర్తు చేశారు. ఈ అంశం ఏపీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినదని చెప్పారు. సచివాలయం, వాలంటీర్ల వ్యవస్థను దేశంలోని రాష్ట్రాలన్నీ ప్రశంసిస్తుంటే పనిగట్టుకుని దుష్ప్రచారం చేయడం బాబు, పవన్‌లకు మాత్రమే చెల్లిందని ధ్వజమెత్తారు. పాలనను ప్రతి గడపకూ తీసుకెళ్లడంలో సీఎం జగన్ విజయం సాధించారని చెప్పారు. ఎవరెంతగా దుష్ప్రచారం చేసినా ప్రజలు నమ్మరని, తిరిగి వైఎస్ జగన్‌కే పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేశారు.


