Home Page SliderNational

రాహుల్ గాంధీకి పాత బంగ్లా కేటాయింపు

లోక్ సభ సభ్యత్వం తిరిగి పునరుద్ధరించడంతో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి గతంలో తాను నివాసించిన బంగ్లాను తిరిగి కేటాయించారు. 12 తుగ్లక్ లేన్‌ను బంగ్లాను రాహుల్ తిరిగి పొందారు. 2019 నాటి “మోదీ ఇంటిపేరు” పరువు నష్టం కేసులో సుప్రీం కోర్టు తన శిక్షపై స్టే విధించిన తర్వాత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పార్లమెంటేరియన్‌గా తిరిగి నియమించబడిన ఒక రోజు తర్వాత ఢిల్లీలోని ప్రభుత్వ బంగ్లాను తిరిగి కేటాయించింది. లోక్‌సభ హౌస్ కమిటీ రాహుల్ బంగళాపై నిర్ణయం తీసుకొంది.