Home Page SliderNational

బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ కీలక సూచనలు

దేశవ్యాప్తంగా త్వరలోనే సార్వత్రిక ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోని అధికార,ప్రతిపక్ష పార్టీలు వ్యూహ-ప్రతి వ్యూహాలతో పథకాలు రచిస్తున్నాయి. ఈ మేరకు బీజేపీ పార్టీ కూడా ఎంపీలతో వరుస భేటీలు నిర్వహిస్తుంది. కాగా ఈ భేటీలలో ఎంపీలకు ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ భేటీలలో ప్రధాని మోదీ ఎంపీలు అందరు వివాదాలు,వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని సూచించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా అనవసర వ్యవహారాల్లో తలదూర్చి నోరు జారొద్దని చెప్పినట్లు సమాచారం. కాగా అధికార పార్టీ నేతలను రెచ్చగొట్టేందుకు ప్రతిపక్షాలు అనేక ప్రయత్నాలు చేస్తుంటాయని తెలిపారు. అయితే BJP ఎంపీలు వారి ట్రాప్‌లో పడకుండా జాగ్రత్త పడాలని ప్రధాని మోదీ సూచించారు.