జైపూర్-ముంబై ఎక్స్‌ప్రైస్‌లో కాల్పులు ..నలుగురి మృతి
రాజస్థాన్‌లోని జైపూర్ నుండి ముంబై వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలులో దారుణం చోటుచేసుకుంది. ఈ ట్రైన్‌లో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చేతన్ కుమార్ కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో నలుగురు మృతి చెందారు. వీరిలో ఆర్పీఎఫ్ ఏఎస్సై కూడా ఉన్నారు. వీరు బి 5 కోచ్‌లో ప్రయాణిస్తున్నారు. రైలు మహారాష్ట్రలోని పాల్ఘర్ స్టేషన్‌ను దాటిన అనంతరం ఈ ఘటన జరిగింది. ఈ కానిస్టేబుల్ మొదట కోపంతో ఏఎస్సై టీకా రామ్ మీనాను కాల్చి చంపాడు. అనంతరం మరో బోగీలోకి వెళ్లి, అక్కడ ముగ్గురు ప్రయాణికులను కాల్చాడు. దీనితో వీరందరూ అక్కడి కక్కడే మరణించారు. దహిసర్ స్టేషన్ వద్ద చేతన్ కుమార్ రైలు నుండి దూకేశాడు. దీనితో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని అతని వద్ద గల తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో రైలు ముంబైకి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ హత్యలకు గల కారణాలు ఇంకా తెలియలేదు.

