Andhra PradeshHome Page Slider

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకుర్

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకుర్ నియమితులయ్యారు. ఈ నెల 5న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‌తో కూడిన కొలీజియం చేసిన సిఫార్సు చేసింది. దీనికి  రాష్ట్రపతి ద్రౌపది ముర్ము  ఆమోదముద్ర వేయడంతో కేంద్ర న్యాయశాఖ దానికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. ఈ విషయాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ ట్విట్టర్‌లో వెల్లడించారు. గతంలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి లభించడంతో ఆయన స్థానంలో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఏ.వి. శేషసాయి వ్యవహరించారు. ఇప్పడు జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నెల 27, 28 తేదీల్లో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జమ్ము కాశ్మీర్‌కు చెందిన ధీరజ్ సింగ్ ఠాకూర్ గతంలో బాంబే హైకోర్టు జడ్జిగా పని చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.