మరోసారి మారనున్న ట్విటర్ లోగో
ఎలాన్ మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచి ట్విటర్‌లో ఎన్నో కీలక మార్పులు చేస్తూ వస్తున్నారు. కాగా గతంలో ట్విటర్ యూజర్ ఒకరు ట్విటర్ లోగోను డాగ్‌గా పెట్టొచ్చు కదా అని అడిగితే మస్క్ ఆ యాజర్ కోరిక మేరకు కొన్ని రోజులపాటు ట్విటర్ లోగోను డాగ్‌గా మార్చారు. ఆ తర్వాత మళ్లీ యథాతథంగా బర్డ్ లోగోనే కొనసాగించారు. అంతేకాకుండా మొన్నటివరకు ట్విటర్ అధినేతగానే కాకుండా సీఈఓగా కూడా మస్క్ పనిచేశారు.కాగా ఇటీవల కాలంలోనే సీఈఓగా ఓ మహిళను నియమించిన విషయం తెలిసిందే. అయితే మస్క్ మళ్లీ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే ట్విటర్ లోగోను Xగా మారుస్తున్నట్లు మస్క్ తాజాగా ప్రకటించారు. దీనికి అనుగుణంగానే ట్విటర్ వెబ్‌సైట్‌ను మార్చే సన్నాహాలు చేస్తున్నారు. దీంతో ఇకపై X.com ఎంటర్ చేస్తే ట్విటర్ ఓపెన్ అయ్యేలా మార్పులు చేశారు. అయితే మస్క్ కొత్త నిర్ణయంపై మిశ్రమ స్పందనలు వెల్లువెత్తుతున్నాయి.

