రాహుల్ గాంధీకి కేరళ ఆయుర్వేద చికిత్స
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శుక్రవారం నుండి వారం రోజుల పాటు కేరళలో ఆయుర్వేద చికిత్స తీసుకోబోతున్నారు. మలప్పురం జిల్లాలలోని కొట్టక్కల్ ఆర్య వైద్యశాలకు ఆయన చికిత్సకు వెళ్లారు. ఆయనకు ప్రత్యేకంగా ఈ ఆర్య వైద్యశాల మేనేజింగ్ ట్రస్టీ పి.ఎం. మాధవన్ కుట్టి వారియర్ పర్యవేక్షణలో చికిత్స అందిస్తారని సమాచారం. భారత్ జోడో యాత్ర సందర్భంలో దేశంలోని ఊర్లన్నీ కాలినడకన తిరగడంతో తనకు మోకాళ్ల నొప్పులు వచ్చాయని గతంలో వెల్లడించారు రాహుల్. కానీ ఆయన ఏ ఆరోగ్య విషయంగా చికిత్స తీసుకుంటున్నారో స్పష్టత లేదు. రాహుల్‌తో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ కూడా ఈ వారం రోజులు వైద్యశాలలోనే ఉంటారని పేర్కొన్నాయి కాంగ్రెస్ వర్గాలు.

