Home Page SliderNational

టమాటాలకు పాము కాపలా..

కర్ణాటకలో ఓ వింత జరిగింది. పాములు కూడా టమాటోలపై కన్ను వేసినట్లున్నాయి. కర్ణాటకలోని ఓ ఇంట్లో టమాటోల దగ్గర పాము చక్కర్లు కొడుతోంది. దగ్గరకొచ్చిన వాళ్లపై బుస కొడుతూ పడగ విప్పుతోంది. దీనితో ఈ పాము టమాటోలకు కాపలా ఉందంటూ చూసిన వాళ్లు వీడియోలు తీసి, ఫొటోలు తీసి వైరల్ చేశారు. ఈరోజు,రేపు టమాటోలు బంగారం కన్నా ఎక్కువయిపోయాయి. టమాటోల గురించి రోజుకో వార్త చక్కర్లు కొడుతోంది. మొన్న ఒక రైతు టమాటో పొలంలో కాపలా పడుకుంటే అతని గొంతు కోసి చంపేశారు దుండగులు. మరోచోట టమాటోల మార్కెట్లో బౌన్సర్లను పెట్టారు. ముగ్గురు రైతులు నెలరోజుల కాలంలో టమాటోలు అమ్మి కోటీశ్వరులు అయిన వార్తలు కూడా మీడియాలో వినిపిస్తున్నాయి. ఈ టమాటోల దిగుబడి పెరిగి రేటు తగ్గేలోపల ఇంకెన్ని వార్తలు వస్తాయో?