యూపీఏ పేరు మారిపోయింది. ఇకపై, దీనిపేరు ‘INDIA’ అంటే…
2004 నుండి ఉన్నయునైటెడ్ ప్రొగ్రెసివ్ అలయెన్స్(UPA)గా ఉన్న పేరును మార్చుకుంటున్నాయి కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు. బెంగళూరులో జరుగుతున్న విపక్షాల భేటీలో ఈ పేరును నిర్ణయించారు. ఇకపై ఈ కూటమి పేరు INDIA అని పెట్టనున్నారు. అంటే ‘ఇండియన్ నేషనల్ డెమొక్రటిక్ ఇంక్లూజివ్ అలయన్స్’. ఇకపై ఈ విపక్ష కూటమి ఈ పేరుతో పిలువబడుతుంది. ఈ పేరును అధికారికంగా కాసేపట్లో ప్రకటించబోతున్నారు. ఈ పేరును ప్రకటించడంతో పాటు ఛైర్ పర్సన్, కమిటీ మెంబర్స్‌ను కూడా ప్రకటించనున్నారు. 26 పార్టీల ఈ కూటమి రాబోయే పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై సరికొత్త వ్యూహాలను రచించబోతోంది. ఈ కూటమిలో మెజారిటీ పార్టీ అయిన కాంగ్రెస్‌తో పాటు TMC, CPI, AAP, RJD, JMM, NCP, SP, SHIV SENA, JDU వంటి పార్టీలు ఉన్నాయి. ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, అఖిలేష్ యాదవ్ వంటి ముఖ్యపార్టీ నేతలంతా హాజరయ్యారు.