శ్రీ సత్యసాయి జిల్లాలో ఎలుగుబంట్ల సంచారం
ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లాలో ఎలుగుబంట్లు సంచరించడం స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. కాగా నిన్న రెండు ఎలుగుబంట్లు ఇళ్లల్లోకి దూసుకువచ్చాయి. దీంతో అక్కడి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. మడకశిర నియోజకవర్గం అమరాపురం మండలంలోని గౌడనకుంట గ్రామంలోకి సోమవారం రాత్రి ఒక్కసారిగా రెండు ఎలుగుబంట్లు పరుగులు తీస్తూ దూసుకొచ్చాయి. అయితే అవి ఓ ఇంటి పరిసరాల్లోకి రావడంతో ఓ యువతి భయంతో ఇంటి లోపలికి పరుగు తీసింది. దీంతో గ్రామ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కాగా ఈ ఘటన అక్కడ ఉన్న సీసీటీవీలో రికార్డ్ కావడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

