Home Page SliderTelangana

చికోటి ప్రవీణ్ గన్‌మెన్లపై పోలీస్ కేసు

ఆన్ లైన్ జూదం, ఫారెన్ టూర్లు, అనుమతి లేని అటవీ జంతువుల పెంపకం వంటి కేసులలో దోషిగా ఉన్న చికోటి ప్రవీణ్ ఏర్పాటు చేసుకున్న గన్‌మెన్ల్ ముగ్గురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. నిన్న జరిగిన లాల్ దర్వాజా ఆలయంలో బోనాలు ఉత్సవాలకు గన్‌మెన్లతో వచ్చి హల్‌చల్ చేశారు చికోటి ప్రవీణ్. ఈ సెక్యూరిటీ వారు అనుమతి లేని గన్‌లను, లైసెన్స్ లేని ఆయుధాలను వాడుతున్నారని పోలీసులు గుర్తించారు. వారు ఛీటింగ్, ఫోర్జరీలతో ఈ వెపన్స్ వాడుతున్నారని ఆరోపించారు. సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌గా పనిచేసినట్లు చెప్తున్న రాకేష్ కుమార్, సుఖావత్ సుందర్ నాయక్ అనే వ్యక్తి ఎక్స్ సర్వీస్ మ్యాన్‌గా చెప్తున్నారు. రమేష్ గౌడ్ ప్రైవేట్ సెక్యూరిటీగార్డునని చెప్తున్నారు. వీరు చూపించిన ఆయుధాలకు, వాటి లైసెన్స్‌లకు తేడాలున్నాయని పోలీసులు చెప్తున్నారు. వీరిపై 420 ఛీటింగ్ కేసు,ఆర్మ్స్ యాక్స్ కింద కేసు నమోదు చేశారు. ఈ మధ్య కొందరు ప్రైవేట్ సెక్యూరిటీని దుర్వినియోగం చేస్తున్నారు. వారిని తమ హోదాకు చిహ్నంగా భావిస్తున్నారు. వారితో ఫొటోషూట్లు చేసుకుంటున్నారు. మాకు ప్రాణహాని ఉందంటూ ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టించుకునే వ్యక్తులు ఒకరకమైన వివాదాలకు కేంద్రాలవుతున్నారు. గత వారంలో ఎమ్మెల్యే ఫైలట్ రోహిత్ రెడ్డి కూడా సెక్యూరిటీ సిబ్బందితో ఫొటోషూట్ చేసుకోవడం వివాదంగా మారింది. ఇలాంటి ప్రైవేట్ సెక్యూరిటీలకు ఉండే ఆయుధాలపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణ ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగే విధంగా ఉండే ఇలాంటి సెక్యూరిటీ వారిపై విచారణలు జరిపి, తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.