Home Page SliderNational

ఏపి మంత్రులను ప్రశంసించిన కేంద్రమంత్రి గడ్కరీ

ఏపీ ప్రభుత్వంపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రశంసల వర్షం కురిపించారు. ఏపీలో 3 మేజర్ పోర్టులను ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందన్నారు. అయితే ఈ ప్రాజెక్టులకు కేంద్ర నిధులు రాబట్టడంలో ఏపీ ఎంపీలు మంచి పనితీరు కనబరుస్తున్నారని ఆయన కొనియాడారు. ఈ మేరకు రూ.500 కోట్లతో ఏపీ ప్రభుత్వానికి National Highways Authority Of Indiaకి మధ్య ఒప్పందం కుదిరిందన్నారు. కాగా ఏపీలో జాతీయ రహదారుల నిర్మాణం ద్వారా మరింత పారిశ్రామికాభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. అయితే  ఏపీలోని తిరుపతిలో త్వరలోనే ఇంటర్నేషనల్ సెంట్రల్ బస్ స్టేషన్ నిర్మాణం చేస్తామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారు.