భారీగా పెరిగిన బంగారం ధరలు
దేశవ్యాప్తంగా బంగారం ధరలు మరోసారి ఆకాశాన్నంటాయి. ఇవాళ బులియన్ మార్కెట్‌లో బంగారం ధర రూ.60,000 మార్క్‌ను అందుకుంది. కాగా ప్రస్తుతం మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.380 పెరిగి రూ.60,000 వేలకు చేరింది. అయితే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.350 ఎగబాకి రూ.55,00 వద్ద కొనసాగుతోంది. మరోవైపు కేజీ వెండిధర రూ.2,500 పెరిగింది. దీంతో మార్కెట్‌లో వెండి ధర రూ.79,500గా ఉంది. కాగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఆర్థిక మాంద్యం వల్ల గత కొన్ని రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ..వస్తున్న ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ నెల ఆషాడమాసం కావడంతో బంగారం ధర తగ్గుతోందని ఆశించిన మగువలకు నిరాశే మిగిలింది.

