Andhra PradeshHome Page Slider

ఏపీ ట్రిపుల్ ఐటీ ఫలితాలు విడుదల

ఏపీలో ట్రిపుల్ ఐటీ ఫలితాలు విడుదలయ్యాయి. కాగా రాష్ట్రంలోని ట్రిపుల్ ఐటీల్లో అర్హులైన అభ్యర్థుల జాబితాను మంత్రి బొత్స సత్యనారాయణ తాజాగా విడుదల చేశారు.ఈ మేరకు ఈ ట్రిపుల్ ఐటీల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈ నెల 20 నుంచి 25 వరకు కౌన్సిలింగ్ ఉంటుందని మంత్రి బొత్స తెలిపారు. కాగా ఏపీలో 6 సంవత్సరాల ట్రిపుల్ ఐటీ కోర్సుకు 4,400 సీట్లు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే విద్యార్థులకు ఐఐటీ స్థాయి విద్యని అందించాలనే లక్ష్యంతో వైఎస్ఆర్ ఆర్జియూకేటీలను ప్రారంభించారని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. కాగా ఏపీ ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ..10వ తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను మెరిట్ ఆధారంగా ఈ ట్రిపుల్ ఐటీలకు ఎంపిక చేస్తారు.