త్వరలో వైసీపీ బంగాళాఖాతంలో కలవడం ఖాయం: టీడీపీ నేత
ఏపీలో నారా లోకేశ్ పాదయాత్ర నేటితో 2000 కిలోమీటర్ల మైలు రాయిని చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి దేవినేని ఉమా దీనిపై మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు జగన్ ప్రభుత్వంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకుంటూ నారా లోకేశ్ పాదయాత్ర చేస్తున్నారని తెలిపారు. అయితే ఈ పాదయాత్రలో పార్టీపరంగా ప్రజలకు భరోసా కల్పిస్తూ లోకేశ్ ముందుకు సాగుతున్నారని ఆయన చెప్పారు. మరోవైపు భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అందరికీ అండగా ఉండే మినీ మ్యానిఫెస్టోను ప్రకటించారన్నారు. అయితే ఈ దసరాకు పూర్తి మ్యానిఫెస్టోను విడుదల చేస్తారని ఆయన తెలిపారు. ఈ మ్యానిఫెస్టోతో వైసీపీ పార్టీ బంగాళాఖాతంలో కలవడం ఖాయమని మాజీ మంత్రి దేవినేని ఉమా స్పష్టం చేశారు.