తానాకు కొత్త ప్రెసిడెంట్ -బాలకృష్ణకు గొప్ప సత్కారం
అమెరికాలోని తెలుగువారి కల్చరల్ కమిటీ తానా వేడుకలు అట్టహాసంగా జరిగాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ, సినీప్రముఖులు ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ముగింపు వేడుకలలో తానాకు కొత్త ప్రెసిడెంటుగా నిరంజన్ శృంగవరపు ఎన్నికయ్యారు. నటరత్న బాలకృష్ణ చేతులమీదుగా ప్రమాణస్వీకారం చేశారు. ఇప్పటివరకూ లావు అంజయ్య చౌదరి ప్రెసిడెంటుగా వ్యవహరించారు. ఇక మీదట కొత్త ప్రెసిడెంటు బాధ్యతలు స్వీకరిస్తారు. తానాకు బాలకృష్ణ సేవలను అభినందిస్తూ న్యూజెర్సీ అసెంబ్లీ తీర్మానం చేసింది. నటుడిగా, మానవతావాదిగా బాలకృష్ణ సేవలు అమోఘమంటూ కీర్తించింది. ఈ ముగింపు వేడుకలలో బాలకృష్ణకు ఈ తీర్మానం కాపీని అందించారు అసెంబ్లీ ప్రతినిధి సాకేత్ చదలవాడ.

