ఫలక్ నామా రైలు ప్రమాదం కారణమిదేనా?
నేడు జరిగిన ఫలక్‌నామా రైలు అగ్నిప్రమాద తీవ్రత రెండు బోగీల నుండి ఏడు బోగీలకు పెరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని పగిడిపల్లి-బొమ్మాయిపల్లి మధ్య నడుస్తున్న సమయంలో ఈ రైలులో షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఈ ప్రమాదానికి అసలు కారణం ఒక వ్యక్తి కాల్చిన సిగరెట్టుగా కొంతమంది ప్రయాణికులు తెలియజేస్తున్నారు. దీనిపై రైల్వేశాఖ విచారణకు ఆదేశించింది. ఈ ప్రమాదం కారణంగా రెండు రైళ్లను రద్దు చేశారు. మరో నాలుగు రైళ్లను దారి మళ్లించినట్లు దక్షిణమధ్య రైల్వే తెలియజేసింది. సికింద్రాబాద్- రేపల్లె,సికింద్రాబాద్- మన్మాడ్ రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ రైలు మంటలు పూర్తిగా అదుపులోనికి వచ్చాయి. దీనిని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు తరలిస్తున్నారు.