ప్రియాంక గాంధీ తెలంగాణా పర్యటన ఖరారు
కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ తెలంగాణా పర్యటన ఖరారైంది. దీని ప్రకారం ఆమె ఈ నెల 20న మహబూబ్‌నగర్‌లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో మహబూబ్‌నగర్‌లో బహిరంగ సభను నిర్వహించనున్నారు. కాగా ఈ సభలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ,ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి ,ఆయన తనయుడు రాజేశ్‌రెడ్డి ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. వీరితోపాటు పలువురు నేతలు,కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రియాంక గాంధీ సభ ద్వారా కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో మహిళలకు భారీగా ఎన్నికల హామీని ప్రకటించే అవకాశమున్నట్లు సమాచారం. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

