Home Page SliderTelangana

ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ ఆహ్వానం పలుకుతారా?

ప్రధాని మోదీ ఈ నెల 8న తెలంగాణాలోని వరంగల్‌లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ వరంగల్ టూర్‌కు సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం అందింది. కాగా ప్రధాని వరంగల్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. దీంతో ప్రోటోకాల్ ప్రకారం సీఎం కేసీఆర్‌ను కేంద్రం ప్రభుత్వం ఆహ్వానించింది. అయితే సీఎం కేసీఆర్ హాజరుపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన వెలవడలేదు. కాగా దేశంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రధానికి సీఎం కేసీఆర్ ఆహ్వానం పలుకుతారా? అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.  మరి తెలంగాణాలో నేనే రాజు..నేనే మంత్రి అని వ్యవహరించే సీఎం కేసీఆర్ ప్రధాని మోదీకి ఆహ్వానం పలుకుతారో లేదో వేచి చూడాల్సివుంది.