“సామజవరగమన” లో 100% ఎంటర్‌టైన్మెంట్ లభిస్తుంది: అల్లు అర్జున్
రామ్ అబ్బరాజు దర్శకత్వంలో యంగ్ హీరో శ్రీ విష్ణు,మోనికా రెబ్బా జంటగా నటించిన చిత్రం “సామజవరగమన”. తాజాగా విడుదలైన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీ యూనిట్‌ను అభినందిస్తూ..ట్వీట్ చేశారు. చాలా రోజుల తర్వాత కుటుంబసమేతంగా సినిమా చివరి వరకూ ఎంజాయ్ చేశాను. చాలా నీట్‌గా సినిమాను డైరెక్ట్ చేశారు. నటీనటులకు శుభాకాంక్షలు.100% ఎంటర్‌టైన్మెంట్ లభిస్తుంది అని ట్వీట్ చేశారు. కాగా గత నెల 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.కేవలం 8కోట్లతో నిర్మించిన ఈ సినిమా విడుదలైన 5 రోజుల్లోనే 20కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు తెలుస్తోంది.

