Home Page SliderInternational

‘డిఫెండింగ్ భారత్ శాఫ్ ఛాంపియన్స్‌’కు మోదీ ప్రశంస

డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ శాఫ్ ఫుట్‌బాల్ టైటిల్ గెలిచిన భారత జట్టుకు ప్రధాని మోదీ ప్రశంసల జల్లు కురిపించారు. మంగళవారం హోరాహోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ జట్టు కువైట్‌పై 5-4 తేడాతో విజయం సాధించింది. తొలి అర్ధభాగంలో కువైట్ ఆధిపత్యం కనపరిచినా బెదరని భారత్ బదులు తీర్చుకుంది. సునీల్ ఛెత్రి నేతృత్వంలో సందేశ్ జింగాన్, చాంగ్తె,సుబాసిస్ బోస్, మహేశ్ వంటి ఆటగాళ్లు మెరుపు వేగంతో గోల్స్ సాధించారు. దీనితో సునాయాసంగా  ఈ టోర్నీలో విజేతగా నిలిచింది భారత్‌. ఇప్పటి వరకూ ఈ శాఫ్ మ్యాచ్‌లలో  తొమ్మిది సార్లు విజయం సాధించి ఎదురులేని జట్టుగా నిలిచింది భారత్.

బ్లూ టైగర్స్ మళ్లీ సుప్రీంగా నిరూపించుకున్నారంటూ మోదీ ట్వీట్ చేశారు. ఎదురులేని విజయ ప్రయాణంలో పూర్తి పవర్‌ చూపించారని, విశ్వాసంతో ఆడారని ప్రశంసించారు. రాబోయే రోజులలో కూడా అథ్లెట్లందరూ వీరిని స్ఫూర్తిగా తీసుకుని క్రీడలలో భారత ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పాలని ఆశిస్తున్నానని ట్విటర్‌లో పేర్కొన్నారు.