“హాయ్ ఏపీ, బైబై బీపీ, ఒన్స్‌ఎగైన్ వైసీపీ” మంత్రి రోజా వెరైటీ స్లోగన్
హాయ్ ఏపీ, బైబై బీపీ, ఒన్స్‌ఎగైన్ వైసీపీ అంటూ మంత్రి రోజా వెరైటీ స్లోగన్ పాడుతున్నారు. పవన్ ఇరిటేషన్ స్టార్, చంద్రబాబు ఇమిటేషన్ స్టార్, ముఖ్యమంత్రి జగన్ మాత్రం ఇన్‌స్పిరేషన్ స్టార్ అని జగన్‌ను ఆకాశానికెత్తేస్తున్నారు రోజా. పవన్, చంద్రబాబు కలిసినా జగన్ కాలిపై వెంట్రుక కూడా పీకలేరంటూ ఎద్దేవా చేశారు. మరోసారి అధికారం వైసీపీదే అంటూ ధీమా వ్యక్తం చేశారు. రికార్డులు సృష్టించాలన్నా, రికార్డులు బ్రేక్ చేయాలన్నా జగన్‌కే సాధ్యం అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు ఇవ్వడమే కాకుండా, జగనన్న సురక్షాపథకం ద్వారా ఇంకా పథకాలు అందకుండా మిగిలినవారిని కూడా గుర్తించే మహత్తర పథకం ప్రవేశపెట్టారన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ పనిలోనే నిమగ్నమయ్యారని రోజా పేర్కొన్నారు.

