‘జస్టిస్ ఫర్ ఓజీహెచ్’ ట్వీట్‌ను షేర్ చేసిన గవర్నర్ తమిళిసై
ఉస్మానియా ఆసుపత్రికి నూతన భవనాన్ని కోరుతూ జస్టిస్ ఫర్ ఓజీహెచ్ అనే పేరుతో ఉన్న ట్వీట్‌ను తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రీట్వీట్ చేశారు. నేడు ఆమె ఉస్మానియా ఆసుపత్రి భవనాన్ని సందర్శించి, సమస్యలను అడిగి తెలిసుకున్నారు. రాష్ట్రప్రభుత్వం ఉస్మానియా ఆసుపత్రి నూత భవన నిర్మాణానికి సంబంధించిన హామీని నిలుపుకోవాలని ఆమె కోరుతున్నారు. ఆసుపత్రి పరిస్థితి ఏమీ బాగోలేదని, రోగులు అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. గతంలో ఎంతోమందికి మెరుగైన వైద్యసేవలు అందించిన చరిత్రగల ఉస్మానియా ఆసుపత్రికి ఇలాంటి దుస్థితి పట్టడం విచారకరమని ఆమె పేర్కొన్నారు. ఆమె ఇటీవల ఉస్మానియా ఆసుపత్రిపై చేసిన ట్వీటు ఇప్పటికే తెలంగాణ రాజకీయాలలో ప్రకంపనలు రేపింది. కాగా ఈరోజు ఆమె ఆసుపత్రిని దర్శించడం, అదే సమయంలో ఆరోగ్య మంత్రి హరీష్ రావు ఉస్మానియా వైద్యులందరితో సచివాలయంలో సమావేశం ఏర్పాటు చేయడం విశేషం.

