Home Page SliderNational

“మిస్ శెట్టి..మిస్టర్ పొలిశెట్టి” రిలీజ్ ఎప్పుడంటే…?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క, యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి జంటగా నటిస్తున్న సినిమా “మిస్ శెట్టి..మిస్టర్ పొలిశెట్టి”. కాగా ఈ సినిమా నుంచి బిగ్ అప్‌డేట్ వచ్చేసింది. అదేంటంటే ఈ సినిమా ఆగస్టు 4న ప్రేక్షకుల ముందుకు రాబోతుందని మేకర్స్ తాజాగా ప్రకటించారు. కాగా సినిమాకు పి.మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమా చూసేందుకు వచ్చేటప్పుడు తప్పకుండా టిష్యూలు తెచ్చుకోవాలి. పొట్టచెక్కలయ్యేలా నవ్వుకుంటారు అని చిత్రబృందం ట్వీట్ చేసింది. హీరోయిన్ అనుష్క బాహుబలి లాంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత “నిశ్శబ్దం” అనే లేడి ఓరియంటెడ్ సినిమాలో నటించారు. అయితే ఈ సినిమా 2020లో అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది.కాగా ఇప్పుడు ఈ సినిమాతో దాదాపు 3 ఏళ్ల తర్వాత అనుష్క బిగ్ స్క్రీన్‌పై కన్పించనున్నారు.ఇక హీరో నవీన్ పొలిశెట్టి ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చి సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఆ తర్వాత నవీన్ నటించిన జాతిరత్నాలు సినిమా కూడా సూపర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే.