Andhra PradeshHome Page Slider

సీఎం జగన్‌కు 3 ప్రశ్నలంటూ..విశాఖలో పోస్టర్ల కలకలం

ఏపీలో  జగన్ ప్రభుత్వానికి నిరసన సెగ తగులుతున్నట్లు కన్పిస్తోంది. కాగా సీఎం జగన్ ఏపీ రాజధానిగా  ప్రకటించిన విశాఖ నిరసనకు వేదిక అయ్యింది. అయితే గతంలో కూడా ఇక్కడ సీఎం జగన్‌కు వ్యతిరేకంగా పోస్టర్లు కన్పించాయి. అయితే ఇవాళ మరోసారి సీఎం జగన్‌ను ప్రశ్నిస్తూ..మరోసారి పోస్టర్లు వెలిశాయి. కాగా ఈ పోస్టర్లపై 1.ఏపీ రాజధాని ఏది?2. పోలవరం ఎప్పుడు పూర్తవుతుంది?3.విశాఖ ఉక్కును కాపాడేది ఎవరు?అంటూ 3 ప్రశ్నలు సంధించారు. కాగా ఈ పోస్టర్లను జనజాగరణ సమితి ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అయితే గతంలో జూన్ 24 తాము చేసిన సవాల్‌కు 32 వేలమంది స్పందించారు. అయినప్పటికీ ఒక్కరు కూడా సరైన సమాధానం చెప్పలేక పోయారని జనజాగరణ సమితి పేర్కొంది. ఓ బాధ్యత గల సీఎంగా జగన్ వీటికి తప్పకుండా సమాధానం చెప్పి తీరాలని జనజాగరణ సమితి డిమాండ్ చేసింది.