బస్సు టైరు పేలి మంటలు-25మంది సజీవదహనం
మహారాష్ట్రలోని ఘోరమైన ప్రమాదం జరిగింది. బస్సు టైరు పేలి డివైడర్‌ను ఢీకొనడంతో 25 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. 32 మంది ప్రయాణికులతో యావత్మాల్ నుండి పుణెకు వెళ్తున్న బస్సుకు ఈ రోజు(శనివారం) తెల్లవారు జామున 2 గంటలకు హఠాత్తుగా టైర్ పేలిపోయింది. బ్యాలన్స్ తప్పిన బస్సు డివైడర్‌ను ఢీకొట్టింది. డ్రైవర్ ప్రాణాలతో బయటకు దూకినట్లు సమాచారం. బస్సు మంటల్లో పూర్తిగా కాలి బూడిదయ్యింది. ఆసమయంలో బస్సు బుల్దానాలోని సమృద్ధి మహామార్గ్ ఎక్స్‌ప్రెస్ వే పై వెళ్తోంది. 25 మంది అక్కడికక్కడే చనిపోగా, 8 మంది తీవ్రంగా గాయపడి, బుల్దానా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ శిందే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతదేహాలను గుర్తించి, వారి కుటుంబసభ్యులకు అందిచడానికి ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల పరిహారం ప్రకటించింది మహారాష్ట్ర ప్రభుత్వం.

