Home Page SliderTelangana

ఈటల బీజేపీకి గుడ్‌బాయ్ చెప్పనున్నారా?

తెలంగాణాలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఓవైపు అధికార,ప్రతిపక్షాల పార్టీలు త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. మరోవైపు కొన్ని పార్టీల్లో పలువురు ప్రముఖ నేతలు పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా బీజేపీ పార్టీ నేత,హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బీజేపీ పార్టీపై అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేపు ఆయన స్వయంగా ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు సమాచారం. కాగా ఈ ప్రెస్‌మీట్‌లో ఈటలతోపాటు ఆయన సతీమణి జమున కూడా పాల్గొననున్నారని ఆయన సన్నిహితులు వెల్లడించారు. దీంతో ఈటల బీజేపీ నాయకత్వం పట్ల అసంతృప్తిగా ఉన్నారని అర్థం అవుతోంది. కాగా ఆయన నిన్న కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. అంతేకాకుండా తాజాగా తెలంగాణాలో జేపీ నడ్డా  నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో కూడా ఈటల పాల్గొనలేదు. దీంతో ఆయన బీజేపీ పార్టీకి గుడ్‌బై చెప్పనున్నారని పలువురు రాజకీయ ప్రముఖులు  అభిప్రాయ పడుతున్నారు. ఈ క్రమంలో రేపు ఈటల నిర్వహించే ప్రెస్‌మీట్‌పై అన్నీ పార్టీల్లో  సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.