మేడ్చల్‌లో భారీగా 210 కిలోల గంజాయి పట్టివేత
సోమవారం మేడ్చల్‌లో శంషాబాద్ పోలీసులు, స్పెషల్ ఆపరేషనల్ టీమ్ కలిసి, 210 కిలోల గంజాయిని పట్టుకున్నారు. దీనితో పాటు ఒక కారుని, మొబైల్ ఫోన్‌ను కూడా సీజ్ చేశారు. ఎల్‌బీ నగర్‌కు చెందిన తిరుపతి(20) అనే వ్యక్తి కారులో ఈ గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. తిరుపతి దీనిని సీతారాం అనే ఒడిశాకు చెందిన వ్యక్తి వద్ద కొని మహారాష్ట్రకు చెందిన శివ అనే వ్యక్తికి పంపుతున్నట్లు తెలిపారు పోలీసులు. ఈ క్రమంలో మేడ్చల్ చెక్‌పోస్ట్ వద్ద పట్టుబడ్డాడు తిరుపతి. మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీతారాం , శివ అందుబాటులో లేరని వారిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు.