హైదరాబాద్ స్కైవాక్ కోసం ఢిఫెన్స్ ల్యాండ్ కోరిన కేటీఆర్
తెలంగాణ పురపాలక శాఖా మంత్రి కేటీఆర్ హైదరాబాద్‌లో స్కైవాక్ నిర్మాణానికి ఢిఫెన్స్ ల్యాండ్‌ను వాడుకోవడానికి అనుమతి అడిగుతూ కేంద్ర రక్షణమంత్రి రాజనాథ్ సింగ్‌కు లేఖ రాసారు. హైదరాబాద్‌లోని మెహదీ పట్నం రైతు బజారు వద్ద స్కైవాక్ నిర్మాణం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి, యాక్సిడెంట్ల నివారణకు ఈ స్కైవాక్ నిర్మాణం ఎంతగానో ఉపయోగపడుతుందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాలలో ట్రాఫిక్‌ను తగ్గించే ఏర్పాట్లలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం రద్దీ ప్రదేశాలలో పాదచారుల కోసం స్కైవాక్‌ల నిర్మాణం చేపట్టింది. మెహదీ పట్నం రైతుబజార్ వద్ద ఢిఫెన్స్ ల్యాండ్ ఉన్నందువల్ల అక్కడ ఈ నిర్మాణం కోసం స్థలాన్ని రాష్ట్రప్రభుత్వానికి ఇవ్వాలని కోరారు కేటీఆర్.

