విజయవాడలో ‘టాపర్స్’కు జగనన్న కానుకలు
విజయవాడలో జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో నియోజక వర్గ స్థాయిలో పదవతరగతిలో టాపర్స్‌కు బహుమతి ప్రధానం చేస్తున్నారు. 22,710 మంది టాపర్స్‌కు ఈ బహుమతులు అందబోతున్నాయి. రాష్ట్రస్థాయిలో మొదిటి ర్యాంకు సాధించిన వారికి లక్ష రూపాయలు, ద్వితీయ బహుమతి 75 వేలు, తృతీయ బహుమతి 50 వేల రూపాయలు అవార్డుగా బహుకరిస్తున్నారు. తాను మేనమామగా పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఉద్దేశంతో కొత్తపద్దతులు, సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన విద్యను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశపెడుతున్నామని జగన్ పేర్కొన్నారు.

జిల్లాస్థాయిలో కూడా మొదటి బహుమతి 50 వేలు, ద్వితీయ బహుమతి 30 వేలు, తృతీయ బహుమతి 15 వేల రూపాయల చొప్పున ఇస్తున్నారు. నియోజక వర్గ స్థాయిలో ప్రధమ బహుమతి 15 వేలు, ద్వితీయ బహుమతి 10 వేలు, తృతీయ బహుమతి 5 వేలు ఇస్తున్నారు. అత్యధిక ప్రతిభ కనపరిచిన 20 మందికి కూడా స్టేట్ ఎక్సలెన్స్ బహుమతులు ఇస్తున్నారు. ఇంగ్లీషులో మన ఆంధ్రపిల్లలు అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా చేసే టోఫెల్ ఎగ్జామ్‌ను కూడా ప్రవేశపెడుతున్నామని, బైజూస్ ఇంటర్నేషనల్ కంటెంట్‌ను, 9 వ తరగతి నుండి ట్యాబ్‌లను అందజేస్తున్నామని, ప్రతీ ఒక్కరూ డిగ్రీలు చదవాలని తన ఆశ అని, ఏ పేద విద్యార్థి చదువు అందక నిరాశ పడకూడదని తన ఆకాంక్ష అన్నారు.

పిల్లలకు విద్యాదీవెన, వసతి దీవెన, అమ్మ ఒడి వంటి పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. ప్రపంచంలోని టాప్ 50 కాలేజీలలో సీటు తెచ్చుకుంటే జగన్ మామ ప్రభుత్వమే కోటి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకూ భరిస్తుందన్నారు. ఇలాంటి కార్యక్రమం దేశంలో ఎక్కడా లేదని తెలిపారు. రాష్ట్రస్థాయిలో ఐదు కేటగిరీలలో బహుమతులు ఇస్తున్నామన్నారు.