పవన్ ఒక రాజకీయ వ్యభిచారి -ద్వారంపూడి
కాకినాడలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ ఘాటుగా విమర్శించారు. తనపై, తన కుటుంబంపై పవన్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. పవన్ ఒక రాజకీయ వ్యభిచారి అన్నారు. దమ్ముంటే తనతో పవన్ కళ్యాణ్ కాకినాడలో పోటీచేసి గెలవాలని సవాల్ చేశారు. పవన్ పెట్టిన జనసేన పార్టీ ఎవరికోసం అన్నారు. 9 ఏళ్ల క్రితం జనసేన పార్టీ పెట్టిన పవన్ అప్పటినుండి ప్రజల కోసం ఏమీ చెయ్యలేదన్నారు. గడచిన రెండు ఎన్నికలలోనూ ఘోరంగా ఓడిపోయారని ఎద్దేవా చేశారు. నెలరోజుల వ్యవధిలోనే ఊసరవెల్లిలా మాటలు మార్చారన్నారు. చంద్రబాబుతో ప్యాకేజి బేరం కుదరలేదా అని ప్రశ్నించారు. తనను ఎమ్మెల్యేను చేయండి, ముఖ్యమంత్రిని చేయండి అంటూ ప్రజలను పవన్ అడుక్కుంటున్నారని విమర్శించారు. తాను తన కుటుంబం భూకబ్జాలకు పాల్పడినట్లు నిరూపించమన్నారు. కాకినాడ ప్రశాంతమైన నగరం అని, తనను ప్రజలు ఇష్టపడే రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని, నిన్ను రెండుచోట్ల పోటీ చేసినా ఒక్కచోట కూడా ప్రజలు గెలిపించలేదన్నారు. పవన్ ముఖ్యమంత్రిగా కావాలంటే కేవలం అది సినిమాలలోనే సాధ్యమని, నిజజీవితంలో పగటి కలేనని స్పష్టం చేశారు. పవన్ తనది ‘డి’ బ్యాచ్ అన్నాడని, నీది ఏ బ్యాచ్ ‘పి’ బ్యాచ్ అంటే ‘పిచ్చి బ్యాచ్చా’? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ స్వతంత్య్రంగా ఎవరికీ టికెట్ ఇవ్వలేడని, ఎందుకంటే చంద్రబాబు ఒప్పుకుంటే కానీ పొత్తులలో సరిగ్గా లెక్కలు తేలితే కానీ పవన్ ఏమీ చేయలేడన్నారు. తాను ఎవ్వరి అండా లేకుండా ఈ స్థాయికి వచ్చానన్నాడు.

