Home Page SliderNational

బ్రిజ్ భూషణ్‌కు పోక్సో కేసులో ఊరట

బీజీపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడైన ఆయనపై ఉన్న మైనర్ రెజ్లర్‌ విషయంలో పోక్సో కేసు విషయంలో ఆయనకు ఊరట లభించింది. ఆయనను పోక్సో కేసు నుండి తొలగించమంటూ దిల్లీ పోలీసులు నివేదికను సమర్పించారు. ఈ విషయంలో 500 పేజీల నివేదికను పాటియాలా హౌస్ కోర్టుకు సమర్పించారు. మైనర్ రెజ్లర్ కేసులో సాక్ష్యాధారాలు లేకపోవడంతో పోలీసులు ఆయన పేరును కొట్టేయాలంటూ నివేదిక ఇచ్చారు. దీనిపై జూలై 4న విచారణ జరగబోతోంది. గత కొన్ని నెలలుగా మహిళా రెజ్లర్లు బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేయాలంటూ నిరసనలు చేపట్టారు.

ఈ క్రమంలో ఆయనపై  దిల్లీలోని కన్నౌట్ ప్యాలెస్ పోలీసు స్టేషన్‌లో రెండు FIRలు నమోదు చేశారు. ఆరుగురు రెజ్లర్లు మొదటి FIR, మైనర్ రెజ్లర్ తండ్రి రెండవ FIRను నమోదు చేశారు. మైనర్ కేసులో దర్యాప్తు పూర్తయ్యిందని, మైనర్, ఆమె తండ్రి వాంగ్మూలాలను తీసుకున్నామని, పోక్సో కేసును నిర్థారించే సాక్ష్యాలు లేవని పోలీసులు వెల్లడించారు. రెజ్లర్ల కేసులో ఇటీవల క్రీడామంత్రి అనురాగ్ ఠాకూర్‌తో రెజ్లర్లు సమావేశమయ్యారు. దీనితో ఆయన ఈ నెల 15 లోపు ఛార్జ్‌షీట్ దాఖలు చేస్తామని పేర్కొన్నారు. అలాగే ఫెడరేషన్‌కు ఎన్నికలు నిర్వహిస్తామని, జూలై 6న ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈకేసులో ఇప్పటికే 1000 పేజీల ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేశారు పోలీసులు.