హ్యాపీ బర్త్ డే శ్రీలీల
ఇవాళ టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల పుట్టినరోజు. దీంతో ఆమె ఫ్యాన్స్ శ్రీలీలకు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. కాగా శ్రీలీల పెళ్లిసందడి సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి..మొదటి సినిమాతోనే సూపర్‌హిట్ అందుకున్నారు. అయితే ఆమె నటన,డాన్స్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తూ..కేవలం కొద్దీ కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ లిస్ట్‌లో చోటు దక్కించుకున్నారు. ప్రస్తుతం శ్రీలీల చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. కాగా ఈ రోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా ప్రస్తుతం ఆమె నటిస్తున్న గుంటూరు కారం,భగవంత్ కేసరి,నితిన్-32,బోయపాటి రాపో నుంచి పోస్టర్స్ విడుదల అయ్యాయి. కొత్త సినిమాల్లో శ్రీలీల లుక్స్ అదిరిపోయాయని ఫ్యాన్స్ ట్వీట్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం హీరోయిన్ శ్రీలీల ట్విటర్‌లో ట్రెండింగ్‌లో కొనసాగుతున్నారు.

