Andhra PradeshHome Page Slider

తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతున్న లోకేష్ పాదయాత్ర

టీడీపీ నేత నారా లోకేష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా యువగళం పాదయాత్రను ప్రారంభించారు. అయితే ఆయన రాయలసీమ జిల్లాల్లో 24 రోజుల్లో 1587 కిలోమీటర్ల యాత్ర పూర్తి చేశారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన 52 శాసనసభ నియోజకవర్గాల్లో 35 ఎమ్మెల్యే అభ్యర్థిత్వాలను కూడా లోకేష్ ఖరారు చేయడం జరిగింది. నేడు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కి ప్రవేశించనున్న పాదయాత్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను చాటి చెప్పటంతో పాటు తెలుగుదేశం పార్టీకి ఊపిరి ఊదే లక్ష్యంతో 2022 డిసెంబర్ 27వ తేదీన తన తండ్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో నారా లోకేష్ యువగళం పేరుతో రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర అట్టహాసంగా మొదలైంది. ఈ పాదయాత్ర సోమవారంతో రాయలసీమ ఉమ్మడి జిల్లాల్లో ముగింపుకు వచ్చింది. 124 రోజుల్లో 108 మండలాలు 943 గ్రామాలలో 1587 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తయింది. రాయలసీమ ఉమ్మడి జిల్లాలకు చెందిన 44 శాసనసభ నియోజకవర్గాల గుండా సాగిన యాత్రలో స్థానిక సమస్యలు డిమాండ్లు ఆధారంగా లోకేష్ వందకు పైగా హామీలను ఇచ్చారు. ఇతర అంశాల సంగతి ఎలా ఉన్నా 2019 ఎన్నికల తర్వాత నుంచి స్తబ్దుగా ఉన్న తెలుగుదేశం శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలెత్తటానికి లోకేష్ పాదయాత్ర ఉపకరించిందని విశ్లేషకులు అంటున్నారు.