Home Page SliderTelangana

వరుణ్, లావణ్యలకు చిరు శుభాకాంక్షలు

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలది చాలా అందమైన జంటంటూ ఆశీర్వదించారు చిరంజీవి. మీరిద్దరూ నిండు నూరేళ్లూ హ్యాపీగా జీవించండని శుభాకాంక్షలందజేశారు మెగాస్టార్ చిరంజీవి. తన తమ్ముడు నాగబాబుకి కుమారుడైన వరుణ్ తేజ్ నిశ్చితార్థానికి భార్యతో పాటు హాజరయ్యారు చిరంజీవి. నిన్న రాత్రి హైదరాబాద్‌లో జరిగిన వరుణ్, లావణ్యల ఎంగేజ్‌మెంట్‌కు సినీ, రాజకీయ ప్రముఖులెందరో హాజరయ్యారు. వరుణ్, లావణ్యలు మిస్టర్, అంతరిక్షం అనే సినిమాలలో కలిసి నటించారు. చాలాకాలంగా వీరిమధ్య ప్రేమాయణం నడుస్తున్నట్లు మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు వీరి ఎంగేజ్‌మెంట్‌తో ఈ వార్తలు నిజమేనని రూఢీ అయ్యింది. కుటుంబసభ్యులు సమక్షంలో ఎంగేజ్ మెంట్ ఉంగరాలు మార్చుకున్నారు కొత్తజంట.