Andhra PradeshHome Page Slider

కేశినేని నాని నన్ను చాలాసార్లు అవమానించారు: బుద్దావెంకన్న

విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని నిన్న టీడీపీ పార్టీపై హాట్ కామెంట్స్ చేశారు. తాను కావాలంటే వచ్చే ఎన్నికల్లో  ఇండిపెండెంట్‌గా పోటి చేస్తానన్నారు. ఏ గొట్టంగాళ్లు నన్ను ఏమి చేయలేరని పేర్కొన్నారు. తనకి ఒళ్లు మండితే పార్టీ మారతానని నాని తేల్చి చెప్పారు.అంతేకాకుండా తనకి అన్ని పార్టీల నేతలు టచ్‌లో ఉన్నారని ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఏపీ రాజకీయాలు హీట్ ఎక్కాయి. అయితే ఎంపీ కేశినాని వ్యాఖ్యలపై టీడీపీ నేత బుద్దావెంకన్న స్పందించారు. టీడీపీ ఇన్‌ఛార్జ్‌లను కేశినేని నాని గొట్టంగాళ్లు అనడం ఏంటని బుద్దా వెంకన్న మండిపడ్డారు. కేశినేని నాని తనను ఎన్నోసార్లు అవమానించారని ఆయన ఆరోపించారు. తనని ఎన్నిసార్లు అవమానించిన మౌనంగానే ఉన్నానన్నారు. నాని వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. ఎంపీ కేశినేని నానితో నాకు బేధాభిప్రాయాలున్నాయని బుద్దావెంకన్న స్పష్టం చేశారు. టీడీపీకీ నష్టం కలగకూడదనే..కేశినేని నాని ఏంమాట్లాడినా మౌనంగా ఉంటున్నామన్నారు.