Home Page SliderTelangana

హస్తిన బాట పట్టిన ఈటల రాజేందర్

తెలంగాణా బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ హస్తిన బాట పట్టారు. అధిష్టానం పిలుపు మేరకే ఆయన ఢిల్లీకి వెళ్లినట్లు అనుచరులు చెప్తున్నారు. కర్ణాటకలో బీజేపీ ఓటమి తర్వాత దిద్దుబాటు చర్యలు చేపడుతోంది బీజేపీ. తెలంగాణాలో పార్టీ బలోపేతానికి కొత్త వ్యూహాలు రచిస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణా బీజేపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈటలకు బీజేపీ ప్రచార కమిటీ ఛైర్మన్ పదవిని ఇస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఆయన ఢిల్లీలో ముఖ్యనేతలతో భేటీ కానున్నారు. తెలంగాణా బీజేపీలో పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్, ఈటల రాజేందర్ వర్గాలుగా పార్టీలో చీలికలు కనిపిస్తున్నాయి. ఈ వర్గపోరును అరికట్టేందుకు అధిష్టానం చర్యలు తీసుకోవచ్చని సమాచారం. ఈ కారణంగా కూడా ఈటలను ఢిల్లీకి పిలిచి ఉండొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీఆర్‌ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి, జూపల్లిలను బీజేపీలో చేర్చేందుకు శతవిధాల ప్రయత్నించారు ఈటల రాజేందర్. వారు చివరికి కాంగ్రెస్‌లో చేరబోతున్న సంగతి తెలిసిందే. దీనితో ఈ చేరికలు తనవల్ల కాదంటూ చేతులెత్తేస్తున్నారు రాజేందర్.