మరోసారి శంషాబాద్‌లో భారీగా బంగారం లభ్యం
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీగా బంగారం లభ్యమయ్యింది. సుమారు 2 కిలోల బంగారం పేస్టు రూపంలో కాప్యూల్స్‌లో కస్టమ్స్ అధికారుల కంటబడింది. కస్టమ్స్, విజిలెన్స్ అధికారులు దుబాయ్ నుండి వచ్చిన ఇద్దరు ప్రయాణీకులను తనిఖీ చేయగా, వారివద్ద పేస్టు రూపంలో ఆరు క్యాప్యుల్స్ లభ్యం అయ్యాయి. వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ 1 కోటి ఐదు లక్షలు ఉండొచ్చని అంచనాలు వేస్తున్నారు. వారిద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.