Home Page SliderTelangana

కాంగ్రెస్ హస్తగతమైన  పొంగులేటి, జూపల్లి

బీఆర్‌ఎస్ నుండి సస్పెండయిన నేతలు పొంగులేటి, జూపల్లిలను కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. వీరిద్దరూ ఈ నెల 20 లేదా 25న ఖమ్మంలోని భారీ బహిరంగ సభలో కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఈ సభకు రాహుల్ గాంధీ లేదా ప్రియాంక గాంధీ రానున్నారు. గతంలోనే పొంగులేటి శ్రీనివాస్ రావు, జూపల్లి కృష్ణారావులను చేర్చుకునేందుకు బీజేపీ చేరికల కమిటీ  నేత ఈటెల రాజేందర్ శత విధాల ప్రయత్నించారు. అయితే వారిద్దరూ కాంగ్రెస్‌పైనే మొగ్గు చూపారు. తమ అనుచరులకు కూడా టికెట్ల విషయంలో ప్రాధాన్యత ఇవ్వాలని వారి డిమాండ్. అయితే రాహుల్ టీమ్ వారితో రహస్య సంప్రదింపులు జరిపి వారిని కాంగ్రెస్‌లో చేర్చే విషయంలో విజయం సాధించారు. ఖమ్మం, మెహబూబ్ నగర్‌లలో మంచి పట్టు ఉన్న ఈ ఇద్దరూ కాంగ్రెస్‌లో చేరడంతో కాంగ్రెస్‌కు బలం చేకూరిందనే చెప్పాలి. ఖమ్మం జిల్లా నేతలు రేణుకా చౌదరి, భట్టి విక్రమార్కలు వీరిద్దరికీ టికెట్ల విషయంలో హామీనిచ్చినట్లు సమాచారం.