ఏపీలో పవన్ “వారాహి” యాత్ర షురూ
ఏపీలో జనసేన పార్టీ త్వరలోనే ప్రచార ఢంకా మ్రోగించనుంది. కాగా ఏపీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి ప్రచార యాత్రకు ముహుర్తం ఖరారైంది. ఈ నెల 14 నుంచి వారాహిపై పవన్ యాత్ర ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ తమ ప్రచారాన్ని అన్నవరంలో పూజల అనంతరం మొదలు పెట్టనున్నారు. అయితే తొలి దశలో పవన్ ప్రచార యాత్ర తూర్పు గోదావరి జిల్లా ,పశ్చిమ గోదావరి జిల్లాలో జరుగుతుందని జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఒక్కో నియోజక వర్గంలో 2 రోజులపాటు పర్యటిస్తారని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.