త్వరలో మెగా హీరోతో లావణ్య త్రిపాఠి ఎంగేజ్‌మెంట్
మెగా హీరో వరుణ్ తేజ్ ,హీరోయిన్ లావణ్య త్రిపాఠి రిలేషన్‌షిప్‌లో ఉన్నారని కొన్ని నెలలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే దీనిపై ఇటు వరుణ్ తేజ్ కానీ అటు లావణ్య త్రిపాఠి కానీ ఎప్పుడు స్పందించలేదు. కాగా ఈ వార్తలు నిజమేనని త్వరలోనే వీరిద్దరు ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకోబోతున్నారని తెలుస్తోంది. ఈ నెల 9న వీరిద్దరికి నిశ్చితార్థం జరగబోతుందని వారి సన్నిహితులు చెప్పినట్లు కొన్ని మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. కాగా ఈ ఎంగేజ్‌మెంట్ వేడుక కుటుంబ సభ్యులు ,సన్నిహితుల సమక్షంలో జరగబోతుందని సమాచారం. అంతేకాకుండా త్వరలోనే పెళ్లి తేదీని కూడా ప్రకటించనున్నట్లు కన్పిస్తోంది. అయితే వరుణ్‌తేజ్,లావణ్య త్రిపాఠి మిస్టర్,అంతరిక్షం సినిమాల్లో కలిసి నటించిన విషయం తెలిసిందే.

