Home Page SliderNational

మధ్యప్రదేశ్‌లో కూడా మేమే గెలుస్తాం: రాహుల్ గాంధీ

కర్ణాటకలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ నేతలు,నాయకులు,కార్యకర్తల్లో కొత్త ఆశలు చిగురించాయి. అయితే మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ 150 సీట్లు గెలుస్తుందని  రాహుల్ గాంధీ అన్నారు. కాగా రాజస్థాన్ సీఎం గెహ్లట్,సచిన్ పైలట్‌తో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. కర్ణాటకలో 136 సీట్లు గెలిచామని..మధ్యప్రదేశ్‌లో కూడా 150 స్థానాల్లో గెలుస్తామని రాహుల్ గాంధీ గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్‌లో కూడా కర్ణాటక ఫలితాలే రిపీట్ అవుతాయన్నారు. అయితే సీఎంగా ఈసారి కమల్‌నాథ్‌కు అవకాశమిస్తారా అని ప్రశ్నించగా..రాహుల్ గాంధీ స్పందించకుండా వెళ్లిపోయారు.