Andhra PradeshHome Page Slider

టీడీపీ మ్యానిఫెస్టో వెన్నుపోటు లాంటిది: ఏపీ డిప్యూటీ సీఎం

ఏపీలో రాజకీయాలు రోజు రోజుకు హీటెక్కుతున్నాయి. కాగా వచ్చే ఏడాదిలో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలను టార్గెట్ చేస్తూ అధికార,ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మేత్తి పోసుకుంటున్నాయి. గత రెండు రోజుల నుంచి ఏపీలో టీడీపీ పార్టీ హయాంలో నిర్వహించిన మహనాడు కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ మహనాడు కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు భారీ ఎత్తున తరలి వచ్చారు. దీంతో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఫుల్ ఖుషీ అయ్యారు. ఈ క్రమంలో ఆయన అధికార పార్టీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అనంతరం ఈ మహనాడు కార్యక్రమంలోనే టీడీపీ పార్టీ మినీ  మ్యానిఫెస్టోని చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. అయితే దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి విమర్శలు గుప్పించారు. చంద్రబాబుది వెన్నుపోటు మ్యానిఫెస్టో అని నారాయణ స్వామి ఆరోపించారు. అంతేకాకుండా మహనాడులో చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పారని ఆయన మండిపడ్డారు. చంద్రాబాబు మాటను ప్రజలు ఎవరు నమ్మరన్నారు. సీఎం జగన్ హయాంలో ఏపీ ప్రజలంతా సుభిక్షంగా ఉన్నారని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి స్పష్టం చేశారు.