సూరత్‌లో మహిళా ఫ్రొఫెసర్ ఆత్మహత్యకు, విజయవాడలోని ముస్లిం మహిళకు లింకేంటి?
సూరత్‌లోని మార్చి 16న వీర్ నర్మద్ అనే మహిళా అసిస్టెంట్ ఫ్రొఫెసర్ రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం సృష్టించింది. ఆమె ఆత్మహత్యకు విజయవాడలోని ఓ ముస్లిం మహిళకు ఉన్న లింకును కనిపెట్టారు గుజరాత్ పోలీసులు. మూడు రోజుల పాటు బురఖాలు వేసుకుని మహిళా పోలీసులు ఆమెను వెంబడించి, ఆమెకు ఉన్న నెట్‌వర్క్‌ను కనిపెట్టారు. సూరత్ ఫ్రొఫెసర్ ఆత్మహత్యకు కారణాలు అన్వేషిస్తూ, ఆమె ఫోన్‌ను పరిశీలించిన వారికి ఆమె న్యూడ్ ఫొటోస్‌తో ఆమెను వేధించారని అర్థమయ్యింది. ఆమె బ్యాంకు లోన్ కోసం క్యాష్‌మీ ఆన్ మొబైల్ అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంది. దీనితో ఆమె సెల్‌ఫోన్‌ను హ్యాక్ చేసి, క్లోన్ చేసి, ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేసి వేధించసాగారు నిందితులు. ఈ వేధింపులు తట్టుకోలేక రైలు కింద పడి ఆమె ఆత్మహత్య చేసుకుంది.

అభిషేక్ కుమార్ సింగ్, రోషన్ కుమార్ సింగ్, సౌరభ్ గజేంద్ర కుమార్ అనే బీహార్‌కు చెందిన వ్యక్తులు ఈ పని చేసినట్లు గుర్తించారు. ఫ్రొపెసర్ అకౌంట్ నుండి వారి ఖాతాలకు దాదాపు 48 వేల రూపాయలు అందింది. దీనితో వారిని అరెస్టు చేశారు. వారిని విచారించగా మరో నలుగురు నిందితులు బయటపడ్డారు. వారిలో విజయవాడకు చెందిన జుహి షేక్ అనే మహిళ కూడా ఉంది. ఆమెను అనుసరించగా అన్ని వివరాలు బయటపడ్డారు. ఆమె జల్ఫికర్ అనే వ్యక్తితో సంప్రదింపులు జరుపుతోందని తెలిసింది. ఆమెకు పాకిస్తాన్ నుండి డబ్బు అందుతున్నట్లు, పాక్‌కు చెందిన అకౌంట్ల నుండి ఆమె ఖాతాకు ప్రతీ నెల డబ్బు వస్తోందని తెలిసింది. ఈ ముఠా పని ఏమిటి? వారు ఎందుకు ఇక్కడ మహిళలను వేధిస్తున్నారు ? అనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.