Home Page SliderNational

అభిమాని మృతిపై హీరో సూర్య ఎమోషనల్ పోస్ట్

ఇటీవల అమెరికా టెక్సాస్‌లోని ఓ మాల్‌లో జరిగిన కాల్పుల్లో తెలంగాణాకు చెందిన ఐశ్వర్య తాటికొండ మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో ఆమె కుంటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.  కాగా ఐశ్వర్య మృతిపై హీరో సూర్య స్పందించారు. ఐస్వర్య తన అభిమాని అని తెలుసుకున్న హీరో సూర్య భావోద్వేగానికి గురైయ్యారు. అంతేకాకుండా ఐశ్వర్య మృతిపై విచారం వ్యక్తం చేస్తూ..ఆమె చిత్రపటం వద్ద పూలు ఉంచి శ్రద్దాంజలి ఘటించారు. అనంతరం ఆమె కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ లేఖను రాశారు. ఈ లేఖలో మీ కుటుంబాన్ని ఎలా ఓదార్చాలో తనకు మాటలు రావడంలేదని పేర్కొన్నారు. ఐశ్వర్య మృతి మీ కుటుంబానికి తీరని లోటు.టెక్సాస్‌లో జరిగిన కాల్పుల్లో ఐశ్వర్య చనిపోవడం నిజంగా దురదుష్టకరమన్నారు. ఆమె భౌతికంగా మనకు దూరమైనప్పటికీ మన జ్ఞాపకాల్లో ఎప్పటికీ నిలిచే ఉంటుందన్నారు. ఓ ధృవతార ఆకాశంలో వెలుగుతూనే ఉంటుందని ఐశ్వర్య తల్లిదండ్రులను ఓదార్చే ప్రయత్నం చేశారు హీరో సూర్య.కాగా ఈ నెల 6న టెక్సాస్‌లో జరిగిన దుండగుల కాల్పుల్లో ఐశ్వర్యతోపాటు ఏడుగురు మృతి చెందారు.