Home Page SliderTelangana

ఈటలను కాంగ్రెస్‌లోకి రమ్మంటూ రేవంత్ పిలుపు

కాంగ్రెస్ పార్టీ అమ్మ లాంటిదని, అందరూ కాంగ్రెస్‌లో చేరండంటూ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈటల రాజేందర్ కాంగ్రెస్‌లోకి వస్తే బాగుంటుందన్నారు. కర్ణాటక ఫలితాలపై దేశమంతా కాంగ్రెస్‌ వైపు చూస్తోందన్నారు. తెలంగాణాలో కేసీఆర్‌కు కర్ణాటకలో బీజేపీకి పట్టిన గతే పడుతుందన్నారు. తెలంగాణాలో బీసీ పాలన తీసుకువస్తాం అని, త్వరలోనే బీసీ గర్జన పెడతాం అని పేర్కొన్నారు. క్షణికావేశంలో పార్టీని వీడిన వారందరూ తిరిగి కాంగ్రెస్‌కు రావాలని ఆహ్వానిస్తున్నారు. వివేక్, కొండా విశ్వేశ్వర రెడ్డి, రాజగోపాల్, ఈటల వంటి అందరూ పార్టీలో చేరాలన్నారు. తనను తిట్టినా పరవాలేదని తాను పట్టించుకోనన్నారు.