జల్లికట్టుకు ఓకే చెప్పిన సుప్రీం
తమిళ సంప్రదాయ జల్లికట్టు ఆటకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఈ క్రీడ నిర్వహణకు ఇక ఎలాంటి అడ్డు లేదని, ఇది జంతుహింస చట్టం పరిధిలోకి రాదని వ్యాఖ్యానించింది. 2014లో సుప్రీంకోర్టు తీర్పులో కొన్ని సవరణలు చేసి, ఇప్పుడు తాజాగా ఈ తీర్పు వెలువరించారు. ఈ చట్టాన్ని సవాల్ చేసిన అన్ని పిటిషన్లను కొట్టివేశారు. ఈ తీర్పులో ఐదుగురు సభ్యుల ధర్మాసనం పాల్గొంది. తమిళనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ జల్లికట్టుపై గతంలో చాలా పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ తీర్పుతో ప్రభుత్వానికి ఊరట లభించింది.