ట్రాఫిక్ కష్టాలతో కారు వదిలి స్కూటర్ లిఫ్టు అడిగిన ‘బిగ్‌బీ’
ఎంత సెలబ్రెటీలకైనా ట్రాఫిక్ తిప్పలు తప్పవు. బిగ్‌బీ అమితాబ్‌ను కూడా ట్రాఫిక్ కష్టాలు వదల్లేదు. సినిమా షూటింగుకు వెళ్తుంటే ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయాడు. టైం సరిపోకపోవడంతో కారు వదిలి పరుగులు పెట్టాడు. చివరకు ఒక బైక్ లిఫ్టు అడిగి షూటింగ్ స్పాట్‌కు చేరుకున్నాడు అమితాబ్. అంతేకాదు, తనకు లిఫ్ట్ ఇచ్చిన స్కూటరిస్టుకి థ్యాంక్స్ చెపుతూ సోషల్ మీడియాలో పోస్టు కూడా చేశాడు మన సూపర్ స్టార్. దీనితో ఆ వ్యక్తి ఉబ్బితబ్బిబయినట్లు వేరే చెప్పాలా దీనితో బిగ్‌బీ సమయపాలనను, పంక్చువాలిటీని పొగడ్తల వర్షంలో ముంచెత్తుతున్నారు నెటిజన్లు.